మనలో చాల మంది నిమ్మ మరియు తేనె రసం గురించి వీనని వారు ఉండరు. ఈ రెండు కలయిక ఆరోగ్య సరంజామా. ఉపవాసం నుండి ఫిట్నెస్ కోసం తపించే వారు ప్రతి రోజు కనీసం ఒక గ్లాస్ నిమ్మ మరియు తేనె రసం త్రాగని వారు ఉండరు. ఈ ఆరోగ్యకరమైన పానీయం త్రాగితే బరువు తగ్గటంలో చాల ఉపయోగ పడుతుంది.
బరువు తగ్గించటంలో ముక్య పాత్ర: ఈ రసం బరువు తగ్గించటంలో చాలా ముఖ్యమైన ప్రయోజనాలలో ఒకటి. మీరు వేడి నీటిలో కొన్ని చుక్కలు తేనె మరియు నిమ్మ రసం ఈది శరీరంలో క్యాలరీలు మరియు కొవ్వు నిల్వలు బర్న్ చేయడానికి సహాయం చేస్తుంది. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ తేనె లోనీ ఆక్సీకరణ గుణం వేడినీటితో కలిసినపుడు ఉపవాసం ఉండేవారికి ఉత్తమ రసం అవుతుంది. బరువు తగ్గాలి అనుకునే వారు ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత మరియు వ్యాయామం చేసిన తర్వాత తెసుకొవచ్చు.
జీర్ణ రుగ్మతలు తగ్గిస్తుంది: ఇది నిమ్మ రసం మరియు తేనే ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. ఇది జీర్ణ రుగ్మతలు తగ్గిస్తుంది. మీరు కడుపు ఉబ్బరం, ఆమ్లత్వం లేదా గ్యాస్ట్రిక్ సమస్యలుతో బాధపడుతు ఉంటే తేనె తో నిమ్మ రసం తీసుకోండి. మీ సమస్య వెంటనే తీరిపోతుంది.
శరీరాన్ని సుద్ది చేస్తది: ఇది నిమ్మ మరియు తేనె రసం మరొక ఆరోగ్య ప్రయోజనం. వేడి నీటితో తాజా నిమ్మరసం మరియు తేనె కలిపి తీసుకుంటే శరీరం నుండి విష పదార్దాలను బయటకు తోసివేస్తాది. అందుకే దీనిని బరువు తగ్గటానికి మరియు ప్రకసవంతమైన చెర్మం కోసం దీనిని తాగమంటారు. మీరు మలబద్ధకం నయం చేసుకోవంటే ఉదయాన్నే వేడి నీరు, తేనే మరియు నిమ్మ రసం కలిపి తీసుకోవాలి.
మూత్రపిండాల్లో రాళ్లు నిరోధిస్తుంది: మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం అనేది ఈ రోజుల్లో చాల మంది కొత్త ఆరోగ్య సమస్య. మూత్రపిండాల్లో రాళ్లు కొన్ని కారణాలు చేత ఏర్పడతాయి. అవి నీరు తక్కువ త్రాగటం, కాల్షియమ్ ఎక్కువగా ఉండటం, మూత్రం ఎక్కువసేపు ఆపుకోవడం.మీరు నిమ్మ మరియు తేనె రసం ద్వారా మూత్రపిండాలులో ఏర్పడిన చిన్న రాళ్ళు నుండి నిరోధించవచ్చు. నిమ్మకాయ రక్తప్రవాహం కాల్షియం శోషిత పడకుండా అడ్డుకుంటుంది ఇది రక్తమూ మరియు శరీరం లోని అధిక కాల్షియం తొలగించడానికి సహాయపడుతుంది.
గొంతు నొప్పి తగ్గిస్తుంది: దగ్గు, గొంతు దురద మొదలగు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటె తేనె మరియు నిమ్మ రసం ఒక గ్లాసు త్రాగండి. హనీ సూక్ష్మ క్రిమి వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంది ఇది బ్యాక్టీరియా మరియు గొంతు సమస్యలు కలిగించే జెర్మ్స ను చంపుతుంది. హాట్ వాటర్ కూడా గొంతు శుభ్రం చేసి మరియు మ్యూకస్ గ్రంథులు తెరిచి సహాయం చేస్తుంది.
పెద్దప్రేగు కాన్సర్ నుండి రక్షిస్తుంది: తేనే అనేక అనామ్లజనకాలు వల్ల ఏర్పడే గడ్డాలతో పోరాడుతుంది. పెద్ద ప్రేగులో ఏర్పడే కాన్సర్ తో పోరాడటానికి సహాయం చేస్తది.