Open Means Open Means

చెవిపోటు వాళ్ళ చెవులు వినపించక పోవడం చెవిలో చీము కారడం ఇలా చాల మందికి జరిగే ఉంటది. చెవి పోటు వాళ్ళ జ్వరం కూడా వస్తుంది. కర్నబెరికి ఏమైనా దెబ్బ తగలడం వల్లనా చెవిలోంచి చీము కారుతుంది. చెవిపోటుకు ఇంకా కారణాలు అనేకం చెప్పుకోవచ్చు. దగ్గు, జలుబు, గొంతు లో సమస్య , సైనెస్, పంటి సమస్యలు వాళ్ళ కూడా చెవిపోటు వస్తుంది. ఇంకా ఇతరం టెక్నాలజీ వల్ల కూడా అంటే ఫోన్ ను ఎక్కువుగా మాట్లాడటం, ఎక్కువసేపు ఇయర్ ఫోన్స్ వాడటం లాంటివి కూడా చేవిపోటుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇపుడు మనం చెవి పోటును నివారించే మార్గాలు కొన్ని చెప్పుకుందాం.

నివారణ మార్గాలు:

  • చెవులో నొప్పి ఎక్కువుగా ఉన్నపుడు జ్వరం వెంటనే వస్తుంది. అలాకాకుండా చీము కారుతున్నపుడు వెంటనే డాక్టర్ నీ సంప్రదించాలి.
  • నొప్పితగ్గే మాత్రలు వేసుకోవచ్చు.
  • చెవి నొప్పి వచ్చినప్పుడు ఒక చిన్న నాప్కిన్ తెసుకోండి దానిని వేడినీటిలో ముంచండి దీనిని బాగా పిండండి ఇప్పుడు దీనిని నొప్పి ఉన్న చెవి మీద ఉంచండి ఇలా అ గుడ్డ చల్ల బడే దాక ఉంచండి. ఇలా కొంచెం సేపు చేస్తే నొప్పినుండి ఉపసేమనం వస్తుంది.
  • చెవి నొప్పి ఉన్నపుడు కొన్ని తులసి ఆకులని తెసుకొని రసం తీసి చెవులో వేసుకోండి.
  • చెవిపోటు అనేది స్నానం చేసేటప్పుడు నీళ్ళు చేవులోకి వెళ్ళినపుడు కూడా వస్తుంది. అలాంటపుడు కొంచెం అల్లం రసాన్ని తీసి చేవులోవేసుకోవాలి కొంచెం సేపు తర్వాత చెవు వంచేయాలి ఇలా చేస్తే అల్లం రసం చెవిలో ఉన్న నీరుతో సహా బయటకు లాగేస్తుంది అ తర్వాత నొప్పి తగ్గుతుంది.
  • చెవిపోటు వచ్చినపుడు చెవులో కొంచెం బ్రాందీ చుక్కలు వేసుకున్న నొప్పినుండి మంచి ఉపసేమనం వస్తుంది.
  • లేదంటే 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి వీటిని బాగా ఉడికించి కొంచెం ఉప్పు కలిపి మెత్తగా నూరాలి ఈ నూరిన పేస్టు ను ఒక చిన్న బట్ట తీసుకొని దానిలో వేసుకొని ముటలగా కట్టి నొప్పి ఉన్న చెవులో పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల నొప్పిలాగేస్తుంది.
  • నువ్వుల నూనెలో ఒక వెల్లుల్లి రేబ్బను వేసి కొంచెం దోరగా వేయించాలి అ తర్వాత ఆ నునెను గోరువెచ్చగా ఉన్నపుడు రొండు చెవుల్లో నాలుగు చుక్కలు చొప్పున వేసుకోవాలి.
  • బాగా నొప్పిగా ఉంటె కొంచెం అతి మధురం తీసుకొని కొంచెం తేనెలో వేసి బాగా మిశ్రమంగా చేయాలి దీనిని నొప్పి ఉన్న చెవి చుట్టూ రాసుకుంటే నొప్పి నుండి తొందరగా రిలీఫ్ వస్తుంది.
  • గోర్రువేచ్చగా ఉన్న నువుల నూనెలో కొన్ని ఆముదం ఆకులూ వేసి బాగా మరిగించి అ నునెను చెవి చుట్టూ రాసుకోవాలి.
  • లేదంటే చిన్న గుగ్గిలం ముక్కను తెసుకొని గ్యాస్ పైన చిన్న మంట మీద వేడి చేసుకోవాలి ఇది కొంచెం వేడిగా అయాక దాని నుండి పొగ వస్తా ఉంటుంది ఆ పోగకు చెవి చూపించిన నొప్పి తగ్గుతుంది.
  • 3 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనెలో ఒక టేబుల్ స్పూన్ వాము వేసి బాగా వేడి చేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నపుడు నొప్పిగా ఉన్న చెవిలో నలుగు చుక్కలు వేసుకోవాలి
  • మావిడాకులని తెసుకొని రసం చేసుకోవాలి ఈ రసాన్ని కొంచెం వేడి చేసుకొని నలుగు చుక్కలు చొప్పున చెవిలో వేసుకోవాలి ఇలా చేస్తే వెంటనే ఉపసేమనం లబిస్తుంది.
  • ముల్లంగిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి వీటిని ఆవ నూనెలో వేసి బాగా మరిగించి ఈ నునెను చెవిలో నాలుగు చుక్కలు వేసుకుంటే నొప్పి నుండి ఉపసేమనం లబిస్తుంది.3
  • ఉల్లిపాయ నుండి రసాన్ని తీసి దానిని వేడి చేసి చెవులో వేసుకున్న కూడా నొప్పి తగ్గుతుంది.
  • ఆవ నూనెను వేడి చేసి చెవులో వేసుకున్న కూడా నొప్పి తగ్గుతుంది.
  • చెవి నొప్పిగా ఉన్నపుడు కాన్దీస్ చప్పరించడం లేదా బాబ్బుల్ గం నమలడంచేస్తే నొప్పి నుండి ఉపసేమనం లబిస్తుంది.
  • ఆవ నూనెలొ కొన్ని మెంతులు వేసి వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత చెవుల్లో వేసుకుంటే చెవిపోటు రాదు, చెవిలో నుంచి చీము కారడం లాంటి సమస్యలు ఉండవు.

          పైన చెప్పిన వీదాలలో ఏదైనా సరే చెవి నొప్పి వచ్చినప్పుడు చేసి వెంటనే ఉపసేమనం కలిగించుకోండి.

No comments

Login to post a comment

Show
  • Create an account
  • Forgot your username?
  • Forgot your password?

Related Articles

  • Reduce weight in 30 days
  • How to fly the fever off?
  • STEM CELL RESEARCH : HYPE AND HOPE
  • Chemistry : Science at the molecular frontiers
  • Fast Recipes-Corriander Rice, Kozikatta and lemon tea
  • Pradeep was silent..
  • Work hard to succeed
  • Ooty - South India's Honeymoon Dream..
  • Virtual world overshadowing the real world
  • Biotechnology
  • About Us
  • Faqs
  • Contact Us
  • Disclaimer
  • Terms & Conditions