నూడిల్స్ అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు. చాల తేలికగా అయిపోతాయీ తినటానికి చాల రుచిగా కూడా ఉంటాయి. వాటిని ఇప్పుడు ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్దాలు:
ఉడికించిన నూడిల్స్- 2 కప్పులు
మష్రూమ్- 1 ½ కప్పులు
ఉల్లిపాయ ముక్కలు- 1 ¼ కప్పులు
టమాట – 1
బటానీలు – 1 ½ కప్పులు
బటర్ – 4 స్పూన్లు
బ్రెడ్ పొడి – 1 ½ కప్పులు
మీరియాల పొడి – 1 ¼ స్పూన్లు
ఉప్పు – 2 స్పూన్లు
తయారీ విదానం:
ముందుగ కడయీ తీసుకొని అందులో బటర్ నీ వేసి వేడిచేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు వేసి బాగా వేగానీయాలి అవి బాగా వేగిన తర్వాత అందులో మష్రూమ్ ముక్కలను వేయాలి. ఇలా అయిదు నిమిషాలు వేగిన తర్వాత బాటని వేయాలి. ఇప్పుడు బాగా వేగిన తర్వత నూడిల్స్ వేయాలి. ఇప్పుడు బ్రెడ్ పొడి మరియు ఉప్పు వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఇలాగా మరో పదినిమిషాలు ఉడికించి మిరియాల పొడి చల్లుకొని దించుకోవాలి. తర్వాత కొంచం ఉల్లిపాయ ముక్కలు ఇంకా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వేడిగా సర్వుచేసుకోవాలి.
అంతే వేడి వేడి మష్రూమ్ నూడిల్స్ రెడీ మీ పిల్లలకు ఇది ఎంతో అరోగ్యాన్ని కూడా ఇస్తుంది.