ఈమద్య కాలంలో చాలామంది బాగా లావుగా కనపడుతున్నారు. ఇది మనిషికి ఒక శాపం లాంటిది. ఎలాంటి సరిరక శ్రమ లేకపోతేయ్ బరువు పెరిగి పోతారు. దీనికి చాల కారణాలు ఉన్నాయ్. మనం ఇప్పుడు కొన్ని చిన్న టిప్స్ చెప్పుకుందాం.
బరువు తగ్గడానికి టిప్స్:
- మొదటగా మీరు బరువు తగ్గలనుకునే వారు నీరు ఎక్కువుగా త్రాగాలి.
- క్యాలరీస్ తక్కువ ఉన్న పానీయాలు తీసుకోవాలి.
- చాల మందికి పొటాటో చిప్స్ తింటే లావు అవుతారు అనుకుంటారు కానీ ఈ చిప్స్ తినే ముందు కొంచెం మంచి నీరు త్రాగండి అప్పుడు పొటాటో చిప్స్ తినటం వాళ్ళ లావు పెరగరు.
- చల్లని నీరు ఎక్కువుగా త్రాగండి ఇది ఆకలని తగ్గిస్తుంది.
- రసాలు లేదా హెర్బల్ టీ బాగా త్రాగోచు.
- బరువు తగ్గాలి అనుకునే వారు రాత్రి పుట అన్నం తినటం మానివేయాలి.
- ఎవైన స్నాక్స్ తినేటప్పుడు ఏమి మాట్లాడకుండా తినటం ఉతమమ్. మాట్లాడట తింటే ఎక్కువ తినేస్తారు.
- అలాగే తినేటపుడు టీవీ చూడడం కూడా మానివేయాలి.
- భోజనం తర్వాత కిచెన్ కు తలం వేయటం చాల మంచిది అపుడు తినాలని అనిపించినపుడు తాళం కనిపించి మీ మెదడును దివెర్త్ చేస్తుంది.
- రాత్రుళ్ళు తక్కువ కేలోరీస్ గల స్నాక్స్ తీసుకోవాలి లేదంటే తక్కువ ఫ్యాట్ గల అరకప్పు ఐస్ క్రీం తినండి.
- ఇష్టమైన ఆహారం తెసుకోవచ్చు. కానీ అది కూడా మీతంగ తీసుకోవాలి. ఇలా చేసినట్టు అయితే మీకు ఇష్టమైన ఆహారం తినట్టు ఉంటది.
- ఒక రోజులో మూడు సార్లు తినటం కన్నా ఏడూ సార్లు తినటం చాల ఉత్తమం. ఈవిదంగా చేస్తే బరువు చాల తొందరగా తగ్గుతారు. ఎందుకంటే తక్కువ కేలోరీస్ తీసుకుంటారు కాబట్టి. ఏడో సారి రాత్రి భోజనం వచ్చే విదంగా మీ ప్రణాళిక చేసుకోవాలి.
- మీరు చేసే ప్రతి భోజనం లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ఫాట్స్ తక్కువుగా ఉండేటట్లు చూసుకోవాలి. ప్రోటీన్స్ మాంసం, పెరుగు, వెన్న, గింజలు, చిక్కులు ఇవి ఆహారం లో ఉండే లాగా చూసుకోవాలి.
- ఆరోగ్యకరమైన ఆహారం ఇప్పుడు సిద్దంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఆకలి వెసినపుడు తినేయాలి. పిజ్జాలు వాటిని తీసుకోవటం మానేయాలి. మీ ఆహారంలో తక్కువ ఫ్యాట్ గల వెన్న తీసుకోవచ్చు. ఆకుపచ్చని కూరగాయలను సలాడ్స్ రూపంలో తీసుకోవచ్చు.
- మీరు తినే ఆహారం చిన్న ప్లేట్స్ లో తినాలి అప్పుడు తక్కువ తిన్న కూడా ఎక్కువ తిన్న ఫీలింగ్ కలుగుతుంది.
- మీరు తినాలి అనుకున్నపుడు కూరగాయలతో పాటు బ్రెడ్, పాస్తా లాంటివి తీసుకోవచు. ఇలాగా చేస్తే మీరు చాల తొందరగా బరువు తగ్గుతారు.
- రోజు ప్రొద్దునే ఒక గ్లాస్ నీటిలో ఒక బద్ద నిమ్మరసం మరియు తేనే కలిపి తీసుకోవటం వల్ల చాల తొందరగా సన్నబడతారు.
- ఎవరికైతే నిమ్మ రసం పడదో వారు ప్రొద్దునే తేనెతో గ్లాస్ వేడి నీటిలో కలిపి త్రాగోచు.
- గుడ్డులోని తెల్ల సోన బరువు తగ్గటానికి చాల సహాయపడుతుంది.
- ఓట్స్ పొద్దున్న టిఫిన్ లాగా పాలతో కలిపి తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు.
- దానిమ్మ కాయలు తినటం వల్ల కూడా బరువు తగ్గుతారు.
- మీరు మాములు నునేలకు బదులు ఆలివ్ ఆయిల్ ఉపయోగించండి మీరే కొన్ని రోజులకు తేడ చూసుకోండి.
- ఒక సారి తినటం కన్నా ప్రతి 3 గంటలకు ఒక సారి తినండి.
- రోజుకు ఒక సారి అయిన ఎదో ఒక పండు తినండి.
- అనింతికన్న ముందుగ మిమ్మలను మీరు సన్నగా ఉన్నటు ఉహించుకొవలి.
- మీ కోరికలను సోగానికి సోగం చేసుకోండి అది కూడా తిండి విషయంలో.
- వేపుడు కూరలను మీ ఆహారం లోనుంచి పూర్తిగా తొలగించాలి.
- మీరు ఆహారం తీసుకునే ముందు సూప్స్ తీసుకోవటం చాల అవసరం ఇది కొంచెం ఆకలిని తగ్గిస్తుంది.
- తిన్న వెంటనే పడుకోకూడదు కనీసం ఒక 10 నిముషాలు అయిన వాకింగ్ చేయాలి అపుడే తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది.
ఈ విదంగా చేసినట్టు అయితే బరువు తగ్గటం చాల సులబం.