గర్బాదరణ జరిగింది మొదలు. ఎన్నో సందేహాలు ప్రదానంగా ఆహరం ఏమి తీసుక్కోవాలి ఇలాంటివి చాల సందేహాలు ఆలోచనలు ఆడపిల్లలకు అదికంగా వస్తాయి. మాములుకన్నా వేరుగా ఏమి తీనాలి. సాదారణంగా తీనేకన్న అప్పుడు ఏది తినాలి. గర్బాదరణ సమయంలో ప్రత్యేకించి ఏమైనా ఆహారాలు ఉన్నాయా ఎలా అనేక సందేహాలు మన అడపిల్లలో ఉంటుంది. గర్బాదరణ జరిగిన తొలిదశలో వీటికి సమాధానమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రతగా రాసి ఉంచుకోండి.
* వెన్న తీసిన పాలు, పెరుగు, మజ్జిగ, జున్ను వీటిలో కాల్షియం బాగా ఎక్కువగా ఉంటుంది. ఎమినో ఆసిడ్స్ లు ఇంకా విటమిన్ బీ-12 వంటివి ఉంటాయి. వీదిగా నిత్యం వీటిని పెద్దమొత్తంలో మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి.
* కూరగాయలు మీ ఆహారంలో అదికంగా ఉండాలి. అన్ని రకాల కూరగాయలు తినాలి. కూరగాయలను ఎక్కువగా సలాడ్స్ రూపంలో తీసుకోవాలి.
* తాజా పండ్లు, తాజా కూరగాయలను ఎంతగా తెసుకుంటే అంత మంచిది .
* మాంసాహారం మరియు చేపలను ఎంత తకువగా తీసుకుంటే అంత మంచిది. వీటికి దూరంగా ఉంటేనే చాల మంచిది.
* ఎక్కువగా ద్రవాహారం తీసుకుంటే శరీరాన్ని చల్లగా ఉండేలా చేస్తాయి. ఇలాంటి సమయంలో నీరు అదికంగా తాగాలి. కూల్డ్రింక్స్ , ప్యాక్ చేసిన కూల్ డ్రింక్స్ అస్సలు త్రాగరాదు.
* ఘీ, వెన్న వీటిని మే ఆహారంలో చాల మితంగా పరిమితంగా తీసుకోండి.
* కాఫీ, టీ లను త్రాగాకపోవడమే మంచిది వీటికి బదులుగా ప్రోటీన్ డ్రింక్స్ తేసుకోవటం అలవాటుచేసుకోండి ఏది ఆరోగ్యానికి చాలా మంచిది.
* ఆవు పాలు, గేద పాలు కన్నా ప్యాస్తురైసేడ్ పాలు చాలా ఉత్తమం.
* డాక్టర్ సలహా మేర విటమిన్ సప్ప్లిమేన్త్స్ తెసుకోండి. ఫోలిక్ ఆసిడ్ విడిగా తెసుకోవాలి. అలానే కాల్షియం, ఇనుము సప్లిమేన్త్స్ కూడా అవసరేమే. ఇవి తెసుకోవాలి అనుకుంటే డాక్టర్ సూచనా తప్పనిసరిగా ఉండాలి.
* మీకు మీరుగా గర్బిని సమయంలో ఎలాంటి మందులు వేసుకోకూడదు. ఒకవేళ మీరు బాధపడుతున్న వ్యాదులకు మందులు వాడుతుంటే ఆ వివరాలు డాక్టర్ కి తెలియజేయాలి అయన సలహా తీసుకోండి.
* సహజంగా గర్బిని సమయంలో 8 నుంచి 15 కిలోలు బరువు పెరుగుతారు అల అని కడుపుమడ్చుకోవటం లాంటివి చేయకూడదు.
* మందు మరియు దుమపానం లాంటివి చేయకూడదు.
* పచ్చి కోడిగుడ్లను అస్సలు తీసుకోకూడదు. పెద్ద పెద్ద చేపలలో పాదరసము ఉంటది కాబట్టి వాటికీ దూరంగా ఉండాలి.
* ఈ విదమైన జాగ్రతలు ఆహారం విషయంలో తీసుకున్నారు అంటే ఆరోగ్యంగా పండంటి బిడ్డకు జన్మనీవగలరు.