మన దేశం లో ప్రతి గ్రామం లో కనిపించే ఆలయాలలో ఎక్కువుగా కనిపించేవి అంజినెయ ఆలయం అనడం లో అతిసోయక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆలయాలో చాల ప్రాచినమైనవి విలక్షనమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం కర్నూల్ జిల్లాలోని ఆదోని కీ సమీపంలోని రనమండలం లో ఉన్న హనుమంతుని ఆలయం ఎన్నో విశిష్టతలు ఉన్న ఈ పవిత్ర ఆలయం గురించి తెలుసుకుందామ.
కర్నూల్ జిల్లాలోని ఆదోని లో చాల ఆలయాలు ఉన్నాయి ఆదోని కి సమీపంలో ని రణమండలం లోని హనుమంతుని ఆలయం చాల విక్యాతమైనది ఈ ఆలయంలో లంక దహనం తర్వాత హనుమంతుడు స్వయంగా కపిల సేనతో వచ్చి ఈ క్షేత్రం లో కోలు వ్యయదని ప్రతీతి. ఈ ఆలయం చిన్న కొండపైన వేలిసిఉంది ఈ ఆలయానికి చేరే మార్గం చెట్లు కొండలు వంటి ప్రాకృతిక సౌందర్యం మద్య సాగుతూ బక్తులలో ఆనందం మరియు పారవశ్యం కలిగిస్తాయి. కిందనుంచి చూసినప్పుడు ఈ ఆలయం ఒక పర్వత దుర్గం మీద నులుచొని ఉన్నటు కనిపిస్తుంది. ఈ ఆలయానికి చేరటానికి కొండపైడక బస్సు సౌకర్యం కలదు ఇంకా బస్సు ఏ కాకుండా మెట్ల మార్గం కూడా వాడుకలో ఉంది.
రణమండల ఆంజనేయ స్వామి వారిని దర్సిన్చుకోవటానికి వచ్చే బక్తులకు ముందుగ దర్సనం ఇచ్చేది స్వాగత ద్వారం ఈ ద్వారం పైన సీతా రాముడు లక్ష్మణుడు ఆంజనేయ వారు దర్శనం ఇస్తారు. ఇక్కడ మెట్లు సర్పులకరంలో ఉంటాయి. ఈ మెట్ల మీద వచ్చే బక్తులు తమ మొక్కులను అనుసరించి ఈ మెట్లకు పసుపు కుంకుమ అద్దుతూ మెట్ల పూజ అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ముక్యంగా సంతానం కోసం వచ్చే మహిళలు ఈపుజ ఎక్కువుగా నిర్వహిస్తారు. ఆ ద్వారం తర్వాత ఆంజనేయ స్వామి పాదుకలు దర్శనం ఇస్తాయి. బక్తులు ఎంతో బక్తితో ఈ పాదుకలకు నమస్కరించికొని ముందుకు సాగుతారు. ఆ తర్వాత కొండపైన ఆరు బయట ఉన్న 12 అడుగుల ఆంజనేయుని విగ్రహం సిందూరం రంగులో ఉంది ప్రకాశిస్తుంది. ఈ విగ్రహం సిందూర లేపనం, వెండి కవచం, రజిత నేత్రాలు, గద,రజిత త్రిచుర్నలతో వర్దిల్లె ఈ స్వామి ఇంకా రుద్రాక్షలు దరించి రాక్షషలను సంహరించే బంగిమలో దర్శనం ఇస్తాడు. స్వామి వారి విగ్రహం కింద ఒక రాక్షసుని ఆకారం కూడా దర్శనం ఇస్తుంది. యుద్దానికి వెళ్తునటు ఉండే ఈ స్వామి వారికీ బక్తులు వినయంగా నమస్కరిస్తారు. బక్తులు తమ కోరికలు నెరవేరినట్టు అయితే తమలపాకులతో పూజలు చేయిస్తారు. ఈ ఆలయంలో ముల విరాట్ కి పూజలు జరిగినట్టే ఉచవ మూర్తికి కూడా పూజలు జరుగుతాయి. ఈ రొండు విగ్రహాలకు దెగ్గరగా ఒక మండపాన్ని నిర్మించారు ఈ మండపంలో అన్ని అవతారాల చిత్రాలు దర్శనం ఇస్తాయి.
కాటార రామలింగ స్వామి వారి ఆలయం:
ఈ గుడికి వచ్చే బక్తులకు ముందుగ ఆలయ గోపురం దర్శనం ఇస్తుంది. ఈ గోపురం పైన దేవత విగ్రహాలు దర్శనం ఇస్తారు. ఇక్కడ శివుడు లింగాకారం లో దర్శనం ఇస్తాడు ఇక్కడి మండపం మొత్తం పల రాతితో నిర్మించారు.
ఆయప్ప స్వామి గుడి:
కాటార రామలింగ స్వామి గుడి తర్వాత బక్తులకు ఆయప్ప స్వామి గుడి దర్శనం ఇస్తుంది. ఆయప్ప విగ్రహం నల్ల రాతితో చెక్కబడింది ఈ విగ్రహానికి స్వర్నబరణలు ఉన్నాయి వీటితో ఇది ప్రకాశిస్తుంది. ఈ విగ్రహం పండాలి పురం లోని పాండురంగడి ఛాయలు కనిపించటం విశేషం.
సీతా రామ మందిరం:
కాటార రామలింగ స్వామి వారి ఆలయం ప్రక్కనే సీతా రామ మందిరం ఉంది. అయ్యప గుడి తర్వాత బక్తులు సీతా రాములని దర్శనం చేసుకుంటారు.
బవాని ఆలయం:
ఆతర్వాత బక్తులు బావని ఆలయం నీ దర్శించుకుంటారు ఈ ఆలయం కొండరాళ్ళ మద్య ఉంది పెద్ద పెద్ద కొండల మద్య ఉన్న సన్నని దారి నుంచి ఈ ఆలయానికి చేరుకోవాలి ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ఇక్కడ అమ్మవారిని దర్సిన్చుకోగలరు ఈ ఆలయం కేవలం 4 అడుగులు మాత్రమే ఉంటుంది.
ఇతర ఆలయాలు:
అమ్మ వారిని దర్శించుకున్న బక్తులు ఆ పరిసరలులో ఉన్న చిన్న వినాయక స్వామి విగ్రహాన్ని మరియు చిన్న హనుమాన్ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. అలాగే అక్కడకు దేగ్గరిలో ఉన్న నాగేంద్రస్వామి ప్రతిమ ను కూడా దర్శించుకుంటారు. బక్తులు ఈ అలయలనింట్లో బక్తి శ్రద్దలతో పూజిస్తారు.
ఇది రణమండలం అంజినేయ స్వామి వారి ఆలయ విశేషాలు. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకొని పునితులు కండి.