కావాల్సిన పదార్దాలు
ఉడికించిన కార్న్ గింజలు: ఒకటిన్నర కప్పు
కొబ్బరి పాలు : 2 కప్పులు
కార్న్ ఫ్లోర్ : ఒక టీ స్పూను
దాల్చిన చెక్క: 2
లవంగాలు: 2
యాలుకలు: 2
నిమ్మరసం : అర చెక్క
ఉప్పు కావాల్సినంత
పేస్టు కోసం కావాల్సిన పదార్దాలు
కొత్తిమీర : ఒకటిన్నర కప్పులు
ఉల్లిపాయ ముక్కలు: అర కప్పు
పచ్చి మిరపకాయలు: 2
కొబ్బరి తురుము : 2 ఒక టీ స్పూన్లు
వెల్లులి రెబ్బలు: 5
గసగసాలు : 4 స్పూన్లు
అల్లం ముక్క
వేడివేడిగా అన్నం
తయారు చేసే పద్దతి
కొబ్బరి పాలలో కార్న్ ఫ్లోర్ కలిపి పక్కన పెట్టుకోవాలి
నాన్ స్టిక్ పాన్ లో కొంచెం నూనే వేసుకొని దానిని వేడిచేసుకోవాలి.
ఇపుడు పైన చేపుకున్న పేస్టు వేసి కొంచెం సెగ మీద అయిదు నిమిషాలు వేయించాలి.
తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలుకలు వేసుకొని ఇంకో నిమిషం వేగనివాలి.
ఇప్పుడు వచ్చిన మిశ్రమంలో నిమ్మరసం కలుపుకోవాలి.
దీనిలో మొక్కజొన్న గింజలు, కొబ్బరి పాలు, అర కప్పు నీరు, ఉప్పు వేసి బాగా కలుపు ఉండాలి.
దీనినే అన్నం లో కలుపుకొని తింటే నోరు ఉరకపోతే చెప్పండి.