భద్రాచలం అనే పేరు భద్రుడు అనే ఒక మహాముని వలన వచ్చింది. ఆయన శ్రీరాముని గురించి గొప్ప తపస్సు చేయగా అందుకు శ్రీరాముడు సంతసించి భద్రుడు పేరుతో ఉన్న ఆ పర్వతం మీద ఆత్మా రాముడిగా వెలసియున్నాడు. దమ్మక్క అనే ముదుసలి ఆ ప్రాంతములో లక్ష్మణ, ఆంజనేయ సీత సమేత రాములవారి విగ్రహాలను అచ్చట ఒకచోట ప్రతిష్టించి వాటికి పూజలు చేసియున్నది. కంచెర్ల గోపన్న ఆ ముదుసలి దమ్మక్క ఆర్తిని గ్రహించి శ్రీరాముని అనుగ్రహముతో భద్రాచలము నందు శ్రీరామచంద్రస్వామి దేవాలయం చక్కని ప్రాకారాలతో నిర్మించెను. ఇది భద్రాచలం యొక్క విశిష్టత.