నిర్ణీతమైన భూభాగమునందు స్థిరనివాసము చేయుచు న్యాయబద్దమైన ప్రభుత్వము గలిగి, సంస్కృతీ సంప్రదాయములతో విలసిల్లు ప్రజాసముదాయమును జాతియందురు. జాతికిచెందిన ముఖ్యవ్యవహారభాష జాతీయ భాషయగు ప్రతిదేశమునకు ఒక జాతీయభాషయుండును. ఆ జాతి జనులు దానిని ప్రభుత్వ వ్యవాహారాదులకు వినియోగించుట సంప్రదాయము.
భారతదేశము భిన్నభాషలకు నిలయము. ఇండో యూరోపియను భాషాకుటుంబములోని ఆర్యశాఖకు చెందిన అనేక భాషలు ఉత్తర భారతదేశములో వ్యవహారమందున్నవి. హిందీ, మారాటి , గుజరాతీ, కాశ్మీరీ, సిందీ, పంజాభీ, బెంగాళీ, అస్సామీ, ఒరియా భాషలు ఈ వర్గమునకు చెందినవి. దక్షిణ భారతదేశములో ద్రావిడభాషా కుటుంబమునకు చెందిన తమిళము, మళయాళము, కన్నడము, తెలుగు, తుళు మొదలైన భాషలు వ్యవహరించబడుచున్నవి. భారత దేశమునందు ఉర్దూ భాష గూడ వ్యవహారములోనున్నది. ఇన్ని భాషలుండుటవలన భారతజాతికి ఏకైక ప్రామాణిక భాషగా నేది యుండవలెనను సమస్య ఏర్పడినది.
అతి ప్రాచీన కాలమునుండి మన దేశములో పైన తెలిపిన పలు భాషలున్నాను సంస్కృతభాష జాతీయ భాషగా ఉపయోగపడినది. వేలాది మతగ్రంధములు, శాస్త్రములు, కావ్యములు, మొదలగున వన్నియు సంస్కృతమునందు రచింపబదినందున సంస్కృతమే విద్యా సంస్కృతీ భాషగా కొనసాగినది. ధర్మన్యాయషిక్షాస్మృతులు సంస్కృతములోనున్నందున స్వదేశ రాజుల పరిపాలన, శాసనములు చాలావరకు సంస్కృతభాషలోనే సాగినవి. ముస్లిముల పరిపాలన మొదలైన తరువాత సంస్కృతము వెనుకబడినది. ఉర్దూ పరిపాలనా భాషయైనది. ఆంగ్లేయుల ఏలుబడిలో ఇంగ్లీషు ప్రభుత్వ వ్యవహారములలో ప్రవేశించినది. మనజాతి స్వతంత్రమైన తరువాత కేంద్ర, రాష్ట్రప్రభుత్వ పరిపాలనా భాషగా నేదియుండవలెనను మీమాంస ప్రారంభమైనది. ఆంగ్లభాష యావద్భారత దేశమున ప్రచారములోనికి వచ్చినందుకు ఆంగ్లమే మన జాతీయ భాష కావలెనని, అది ఉత్తర దక్షిణ భారతములకు సమ్మతముగానుండునని కొందరు వాదించిరి. మరికొందరు విదేశీ భాష మనకు జాతీయ భాషగా నుండరాదు. స్వదేశామందున్న భాషలకు తల్లివంటి సంస్కృతమే రాజభాషగా నుండదగునని కొంతమంది భావించిరి. సంస్కృతము ఒకనాటి భాష నేటి పరిస్థితులకది పనికిరాదని చెప్పవచ్చు. హిందీ అదిక సంఖ్యాకులకు వచ్చిన భాషగనుక హిందీయే జాతీయభాష గాదగునని మరికొందరు తలంచినారు. మనదేశములో పదికోట్లమంది ముస్లీములు ఉర్దూ మాటలాడుచున్నందుచేత హిందీ ఉర్దూ భాషల సమ్మేళనము గావించి హిందుస్తానీ భాషను జాతిఇయభాశాగా చేయుట మంచిదని మహాత్మాగాంది సూచించినాడు. ఇట్లు ఇంగ్లీషు, సంస్కృతము, హిందీలు జాతీయభాష పోటీలో పాల్గొనుచుండగా జూలియస్ హక్స్లివంటి ప్రముఖ శాస్త్రవేత్తలు కొందరు తెలుగు జాతీయభాషగా నుండుట సముచితమని పేర్కొనిరి.
హిందీ జాతీయ భాషయైనప్పుడు హిందీ మాతృభాషయై ప్రజలకు అధిక లాభములు కలుగుట సహజము. ఎంతనేర్చినను దక్షినాది వారి కది అబ్బినట్లుగా కనపడదు. ఉద్యోగావకాశములు హిందీ భాషీయులకే ఎక్కువ దక్కును. దక్షినాదివారికిది అన్యాయము జరుగునను భయసంకోచములు ప్రత్యేకముగా తమిళనాడు వారికి కలిగినవి. ఆ రాష్ట్రములోని రాజకీయ పక్షములు ఆంగ్లమే జాతీయ భాషగా నుండవలెను. హిందివద్దు అను నినాదముతో పెద్దయుద్యమము నడిపినవి. చివరికది హింసామార్గమున పడినవి. ఇది ఇట్లుండగా దక్షినాది వారికి వ్యతిరేకముగా ఉత్తర భారతము నందు సేట్ గోవిందదాన్, రాజనారాయన్, ప్రభృతులు ఆంగ్లవ్యతిరేకోద్యమము ప్రారంభించిరి. ఇంగ్లీషు కనిపించిన చోట తీరుపూసి హిందీ వ్రాసినారు. దానికి ప్రతీకారముగా దక్షినాది రాష్ట్రాలలో హిందీ వ్యతిరేకత పెల్లుబికినది. హిందీ అక్షరములను తారుపూసి చెరిపి ఇంగ్లీషు, ప్రాంతీయ భాషలను వ్రాసిరి. ఇది వెర్రితలలువేసి సద్దుమణిగినది.
ప్రభుత్వముగాని, పార్టీలుగాని, ప్రజా సంఘములుగాని ఆవేశమునకులోనుకాకుండా హిందీని జాతీయ భాషగా ఎన్నుకొనుట మంచిది. ప్రాంతీయ భాషలలో పరిక్షలు నిర్వహించి ఉద్యోగులను దామాషాచోప్పుల ఎన్నుకొనిన చిక్కుండదు. రాష్ట్రములలో ప్రాంతీయభాష, జాతీయభాష హిందీ కేంద్రములలోను పరిపాలనా భాషగానున్నదో సమస్య పరిష్కారమగును.