మన రాష్ట్రం ఎప్పటినుంచో ప్రతి గ్రామానికి ఆదర్శ రైతులు ఎంచి వారికి సరియైన గుర్తింపు ఇస్తుంది. అయితే అందులో ఉదాహరణగా కర్నాటక రాష్ట్రానికి చెందిన మహిళను ఆ రాష్ట్రం ఆదర్శ రైతుగా గుర్తించింది. ఆమె పేరు పాపమ్మ. ఆమె అనేదేమిటంటే ఈ రోజుల్లో వచ్చే ఆహారం అంతా మందుల ద్వారా పందిన్చేదే కాని కేవలం సేంద్రియ ఎరువుల ద్వారానే నేను పంట పండిస్తున్నాను. ఇంతకు ఆమె కథనం ఏమిటో చూద్దాం.
కర్నాటక రాష్ట్రంలో కోలారు జిల్లాలోని ఒక మారుమూల గ్రామమైన డి కురబరహళ్లికి చెందిన పాపమ్మకు కేవలం మూడెకరాల పొలం ఉన్నది. ఈమె గత 20 ఏళ్ల నుండి ఒక్క కూరగాయ కూడా కొనలేదు. అంటే ఈమె గొప్పతనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈమె కిలో బియ్యం కూడా 20 ఏళ్ల నుండి కొనుక్కోలేదు. కర్నాటకలోని ఈమె ఉన్న ప్రాంతం నదుల జాడలేని కరువు జిల్లా కోలారులో ఉన్నది. ఇక్కడి వాతావరణం వేడిగా ఉండటంవల్ల ఈ జిల్లాలో బంగారుగానులు ఎక్కువగా దొరుకుతాయి. ఈమె తన కుటుంబానికి అవసరమైన కూరగాయలు, ఆహారం తన కున్న మూడెకరాల పొలంలో పండిస్తుంది. ఈమె కృషికి గుర్తించిన కర్నాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాజ్యోత్సవ అవార్డుకు ఎంపిక చేసింది. తద్వారా ఈమె పేరును మరియు ఈమె గొప్పతనాన్ని రాష్ట్ర ప్రజలు అంతా గుర్తించారు.
ఈమెకు ఇది ఎలా సాధ్యమైంది?
ఈమెకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఈమె బతకడానికి ఈ మూడు ఎకరాల పోలమే ఆధారం. అందుకు ఆ పోలాన్నే ఆమె నమ్ముకుంది. దానికి అందులో బావిని తవ్వించింది. ఆ బావే మూడెకరాలకు దిక్కు. ఈమె వర్షపు నీరు ఒక చుక్కను కూడా వృథా పోనివ్వకుండా ఆ వర్షపు నీటిని బావిలోనికి మల్లిన్చిది. ఇల్లు కూడా పొలంలో ఉండటం వల్ల ఇంటి నుంచి వచ్చే వృథా నీరు కూడా పొలానికి ఈమె మళ్ళిస్తుంది. ఈమె కున్న మూడెకరాల పొలంలో ఒక ఎకరంలో వరి, మిగతా రెండు ఎకరాలలో 40 , 50 రకాల పంటలు పండిస్తుంది. ఈమె దగ్గర మార్కెట్లో దొరకని కొన్ని రకాల కూరగాయలు కూడా దొరుకుతాయి. చివరకి విత్తనాలను కూడా ఈమె మార్కెట్లో కూడా కొనదు. ఈమె వ్యవసాయం చేస్తున్నప్పటి నుండి ఇప్పటి వరకు తన పొలంలో అవసరమైన అన్ని రకాల విత్తనాలను తాను పండిచిన పంట నుండే దాచుకుంటుంది. అయితే ఏ పంట మధ్య ఏ పంట బాగా పండుతుందో చెప్పడానికి ఏ పుస్తకమును ఈమె తిరిగేయాల్సిన అవసరం లేదు. కాని పాపమ్మకు అది నోటి మీద లెక్క.
ఈమె దగ్గరి సీడ్ బ్యాంక్:
పాపమ్మ మళ్ళీ పంట వేసే వరకు విత్తనాలు పాడవకుండా వేప, సీతాఫలం ఆకుల నుండి తయారు చేసిన పొడితో ఈ విత్తనాలను రక్షిన్తుంది. సాధారణంగా మనకు రెండు రకాల వంకాయలే కన్పిస్తాయి. కాని ఈమె వద్ద ఐదు రకాల వంకాయల విత్తనాలు ఉంటాయి. ఈ విధంగా ప్రతి కూరగాయకు సంబంధించి రెండు, మూడు రకాల విత్తనాలు ఈమె దాచిపెడుతుంది. పాపమ్మ ఈమెకు ప్రక్క ఊళ్ళో తిరిగి విత్తనాలను సేకరించే అలవాటు ఉండటంవల్ల ఈమె వద్ద అన్ని రకాల విత్తనాలు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. స్వంచ్చంద సంస్థల ప్రతినిధులు సంప్రదాయ విత్తనాలు కావాలంటే 90 కిలో మీటర్ల దూరంలో ఉన్న బెంగుళూరు నుంచి పాపమ్మ వద్దకు వస్తుంటారు.
ఈమెను ఆదర్శంగా తీసుకోనని వర్ధమాన రైతులు కూడా కృషి చేస్తే మన దేశం వ్యవసాయంలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంటుంది.