ఇటీవల 2 జీ స్కాముకు సంబంధించి సుప్రీము కోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఈ స్కాముకు సంబంధించి కేటాయిమ్పుల్లని ఏకపక్షముగా జరిగాయని ఇది రాజ్యాంగ విరుద్దమని సుప్రీము కోర్టు తీర్పు వివరణ. ఈ స్కాములో నిందితులుగా ఉన్నవారికి 5 కోట్ల చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా రాజా ప్రధాని మరియు ఆర్ధిక శాఖ యొక్క అభ్యంతరాలను త్రోసిపుచ్చారని కూడా కోర్టు అభిప్రాయ పడింది. చిదంబరం పై దర్యాప్తును సిబిఐ న్యాయస్థానికి వదిలివేసింది. సుప్రీము కోర్టు తన తీర్పులో భాగంగా 122 లైసెన్సులను కూడా రద్దు చేసింది. యూనినార్, లూప్ టెలికం, సిస్తేమ శ్యాం, వీడియోకాన్,టాటాస్ మరియు ఐడియా వంటి టెలికాం కంపనీలు లైసెన్సులను కోల్పోనున్నాయి. ఈ లైసెన్సుల రద్దు నాలుగు నెలల తర్వాత అమలులోకి వస్తుంది. ఈ కేసులో ప్రతి వాదులైన యునిటెక్ వైరులేస్, టాటా టేలిసర్విస్ లకు 5 కోట్ల రూపాయల జరిమానా మరియు లూపు టెలికం, ఎస్ టెల్, ఆలియాన్జ్ ఇన్ఫ్రాటెక్ వంటి కంపనీలు 50 లక్షల రూపాయల చొప్పున జరిమానా చెల్లించ వలసి ఉంటుంది.
ఈ వసూలైన జరిమానాలో 50 శాతంను పేద వారికి న్యాయ సేవలు అందించడానికి సుప్రీము కోర్టు న్యాయ సేవ సమితి వద్ద డిపాజిట్ చేయాలి. మిగతా 50 % ప్రధాన మంత్రి సహాయ నిధిలో జమ చేయాల్సి ఉంటుంది. కొత్త లైసెన్సులను జారీచేసే విషయములో నెల లోపు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కూడా సుప్రీము కోర్టు ఆదేశించింది. ఈ విధముగా 2 జీ స్కాముకు సంబంధించి సుప్రీము కోర్టు తమ తీర్పును వెలువరించింది. ఈ 2 జీ స్కాముకు సంబంధించి జనతా పార్టి అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి ఎప్పటికప్పుడు వాడి వేడి వాదనలతో స్కాము యొక్క పూర్వ పరాలను లేవనెత్తారు.