సంక్రాంతి పండుగ మరియు దాని ప్రాముఖ్యత: సంక్రాంతి పండుగ రాగానే సూర్యుడు మఖర రాశిలో ప్రవేశించాడు అని అర్థం. సంక్రాంతి పండుగను తెలుగు వారు మూడు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని మరియు మూడవ రోజును కనుమ సంక్రాంతి అని అంటారు. భోగి నాడు కుటుంబంలో అందరు తెల్లవారుజామున లేచి తలంటి స్నానం చేసి, వారికి తోచిన రీతిలో భగవంతుడిని పూజించి పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటారు. రైతులకు పంట చేతికి వచ్చే రోజు ఈ రోజే. సంక్రాంతి ముందు రోజు నుండి నెల రోజుల ముందల ధనుర్మాసం ప్రారంభమౌతుంది. ఈ ధనుర్మాసములో నెల రోజుల పాటు వైష్ణవులు తిరుప్పావై పారాయణ చేస్తూ, భగవంతున్ని పూజిస్తూ, చివరి రోజున గోదాదేవి శ్రీరంగానాదుల కళ్యాణం జరుపుతారు.
సంక్రాంతి పండుగ స్త్రీలకు చాలా ముఖ్యమైన పండుగ. ఎందుకంటే ఆ రోజు గొబ్బెమలు పెడుతూ, వారు వేసే ముగ్గులు ఆకర్షణీయముగా ఉంటాయి. హరిదాసు యొక్క కమ్మని పాటలు చెవులకు వీనుల విందు చేస్తాయి. భోగిమంటలలో చలికి కాచుకుంటూ ఉంటుంటే మరియు మంచుతెరలు సూర్యుడు యొక్క వేడిమి తాకిడికి తోలిగిపోతుంటే ఆ ఆనందమే మదిలో ఒక తీపి గుర్తుగా ఉండిపోతుంది.మూడవ రోజైన కనుమ రోజున రైతులు ఎద్దులను మరియు ఆవులను పూజిస్తారు. కృతజ్ఞతగా ఈ పని చేస్తారు. పిల్లలు సంక్రాంతి పండుగ నాడు గాలి పటాలు ఎగుర వేస్తారు. కొంతమంది ఈ పండుగానే "పతంగీల పండుగ" అంటారు కూడా. తమిళనాడు లో ఈ పండుగను "పొంగల్" అంటారు