విశ్వాంత రాలమునందు భూమి యొకటి. దీనిమీద ఎత్తయిన కొండలు, లోతైన సముద్రములు, పొదవిన నదులు, వేశాలమైన అడవుల సారవంతములైన భూములు కలవు. ఇవన్నియు ప్రకృతిలో సహజ సిద్ధముగా ఏర్పడిన సంపదలు. వీనివలన భూమన్దలముపైన నివసించుచున్న మనష్యులు పెక్కు లాభములు పొందుచున్నారు.
ప్రకృతి ప్రసాదించిన సంపదలో నీరు మూడువంతులు. నేల ఒకవంతుగానున్నది. సముద్రములోని అపార సంపద యిప్పుడిప్పుడే మానవులకు లభ్యమగుచున్నది. కాని నేలపైనున్న అరణ్యములు కొన్నివేల సంవత్సరములనుండి మానవాళికి అందుబాటులో నుండి రకరకములుగా ఉపయోగపడుచున్నవి. నేల సారవంతమైనది. అందు రక రకముల గనులున్నవి. పైభాగమున ఏపుగా పెరిగిన చెట్లు, తీగలు, పుడలు, క్రిక్కిరిసి అడవులేర్పదినవి. కొండలపైన, దిగువన చుట్టు పట్టులందు అడవులు దట్టముగా పెరిగి వివిధ ప్రయోజనములకు వినియోగాపడుచున్నవి.
అడవులలో వృక్ష సంపద ఎక్కువగా నుండుటవలన వాన మిక్కుటముగా కురియును. కొండలపైన నుండి సెలయేళ్ళు, వాగులు, నదులు ప్రవహించి పలురకములైన నదీ నదములు ఏర్పడినవి. వానివలన ఒండ్రు మట్టి కొట్టుకొని వచ్చి భూమికి సహజమైన యేరు ఏర్పడుచున్నది. నదీజలము త్రాగుటకు, వ్యవసాయమునకు, నౌకాయనమునకు తోడ్పడుచున్నది. అరణ్యములందు సింహములు, పులులు, ఏనుగులు, లేళ్ళు మొదలగు వివిధ జాతులకు చెందినా క్రూర జంతువులు సాదు జంతువుల నివసించి నయనమనోహరముగా నుండును. పులిగోళ్ళు, ఏనుగుదంతములు, దుప్పి కొమ్ములు, లేడి చర్మము మొదలగునవి లభించు చున్నవి. వీనితో అనేక వస్తువులను అందముగా తయారుచేయుడురు. విహారయాత్రకు, వినోద పర్యటనకు వేటకు మునీశ్వరుల తపస్సునకు ముఖ్య కేంద్రములుగా నున్నవి. మనదేశములో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్తాను. అస్సాం, బెంగాలు, దుర్గమ ప్రదేశములకు దారి దొంకలుండవు. ప్రశాంత గంభీర ప్రకృతిలో విచిత్రానుభూతిని కలిగించును. అరణ్యములో అనేక జాతుల వృక్షములు, తీగలు మొదలగు చెట్లు కకావపయోగించును. అరణ్యములో అనేక జాతుల వృక్షములు, తీగలు క్రిక్కిరిసి యుండును దేవదారు, టేకు, మద్ది, చింత, సేవ, తుమ్మ మొదలగు చెట్లు కలపకుఅయోదించును. వీనిలో ఇండ్ల కవసరమైన దూలములు, సరుగుడు, సీమతుమ్మ వంటి వానిని వంట చెరుకుగా మార్చుకొని కట్టెలు, బొగ్గు తయారు చేయుదురు. బూరుగు చెట్టు నుండి మేలైన దూది లభించి పరుపులకు, దిండ్లకు ఉపయోగపడును. చింతచెట్టునుండి కాయలు, చింతపండు లభించును. కుంకుడు చెట్టు నుండి కుంకుడుకాయలు, మోదుగ చెట్లనుండి విస్తరాకులు, వెదురు పొదలనుండి వాసములు లభ్యమగును. రకరకాలయిన చెట్లలో ఉసిరిక, నేరేడు, రేగు, మారేడు మొదలగునవి ప్రజలకు చాల రకముల కాయలను, పండ్లను ఇచ్చుచున్నవి. కొన్న చెట్ల పూవులు, కొన్నిటి ఆకులు, కొన్నిటి బెరళ్ళు, కొన్నిటి వేళ్ళు మందులకు, సుగంధ ద్రవ్యములకు ఉపయుక్తములగుచున్నవి. అగరు, మంచిగందము, చందనము, పిప్పిళ్ళు, కర్పూరాలు, దాల్చినచెక్క, లవంగాయలు, ఏలకులు, ఖర్జురములు, ఈత, తాడి, ఇప్పచెట్లు ఈ తరగతికి చెందును. లక్క, తేనె, మైనము, నెమలి ఫించములు, పూచిక పుల్లల చీపుళ్ళు, జమ్మి, పచ్చిక మొదలగువానిని అడవులే ప్రసాదించుచున్నవి. అడవులలోని పదార్ధములను వినియోగించు కొని అనేక పరిశ్రమలు వృద్దిచెందుచున్నవి. కలప, కాగితము, బుట్టల తట్టల యల్లిక ఈ తెగకు చెందును. రకరకాల పక్షులకు పుట్టినిల్లగు అడవులలో వేటగాండ్రు, గిరిజనులుగా పిలువబడు కోయ, చెంచు, శబరి, పుళింద, సవరలు మొదలగు అనాగరికులు నివసించుచు అటనీ సంపదను సేకరించు అమ్ముకొని బ్రతుకుచుందురు.
నాగరికత పెరుగుచున్నది. అవసరములు పెరుగుచున్నవి. జనాభా రెట్టింపయినది. అడవులలోని సంపదను వాడుకొనుట హెచ్చినది. అడవులలోని చెట్లను విచాక్షనారహితముగా నరికివేయుచున్నారు. కొంత మేర వంట పొలాలకై దున్నుచున్నారు. క్రమముగా అడవుల విస్తీర్ణము తగ్గిపోవుచున్నది. అడవులు తగ్గినకొలది అనావృష్టి పెరిగి వర్షపాతము తగ్గి నదులలో నీరు పారుట, ఒండ్రుమట్టి కొట్టుకొనివచ్చుట పొలాలకు నీటి సౌకర్యము సహజమైన బలము తగ్గుముఖము పట్టినది. అపురూప మృగములు వేటాడుట వలన అంతరించుచున్నవి. రకరకాల దినుసులు, కాయలు, పండ్ల దిగుబడి క్షీణించినది. ఇప్పటి మాదిరిగానే వ్యవహరించినచో కొద్ది సంవత్సరములలోనే భూమిపై అడవులు రూపుమాయును. అడవులు భూగర్భములో అనగినపుడేర్పడిన నేలబొగ్గు కొల్లపోయి భావితరముల వారికి దొరకదు. కనుక అడవుల నడుపాజ్ఞలు లేకుండ కొట్టరాదు.
మన ప్రభుత్వము అటవీశాఖ నేర్పరచి అజమాయిషీ చేయుచున్నది. అటవీ సంపదను సక్రమ మార్గమున వినియోగమునకు తెచ్చి లాభమార్జించుచున్నది. అటవీ నివాసులకు కొన్ని హక్కులిచ్చినది. కొట్టివేసిన అడవులలో తిరిగి చెట్లను నాటుటకు పెంచుటకు, పెద్ద యెత్తున ముమ్మరముగా పనిచేయుచున్నది. వీలైన తావులలో వనమహొత్సవము జరుపుచు పలురకముల చెట్లను నాటించి వృక్ష సంపదను పెంచుచున్నది. నీడ, ఆహారము, వస్తు సామగ్రి, ఔషధములు, వివిధ పస్తుజాలమునకు మూలమైన అడవులు మానవవాళికి మహొపకారము.