పెళ్లి అనేది ఒక మంచి తోడుని వెతకడం కాదు, ఒక మంచి తోడుగా మిగలడం. అవును, పెళ్ళంటే నూరేళ్ళ పంట అని అందరికి తెలుసు. మన అమ్మ, నాన్న, బంధువులు, స్నేహితులు ఇంకా ఎంతో మంది శ్రేయోభిలాషుల మధ్యన జరిగిన ఈ పెళ్లి నూరేళ్ళ పంటకు వేసిన తొలి అడుగు. ఆ తొలి అడుగే వేయి జన్మల బంధం అవడానికైనా లేక చట్టు బండలవదనికైనా మనమే కారణం. అలాగే మీరు కూడా ఒక మంచి తోడుగా ఉండడానికి ఇదిగో నా ఈ వంద చిట్కాలు.
1 ఊహాలోకంలో మీ శ్రీవారి తో విదేశాలలో విహరించండి. అదే సమయంలో మీ కాబోయే భర్త/భార్య యొక్క ఇంటిల్లి పది తో సంతోషంగా మాటలు కలపండి. ఈ విధంగా వలతో కోతగా వచ్జే సంబంధాలని తెలుసుకున్నట్టు అవుతుంది.
2 మీ కాబోయే భర్త/భార్య తో సంతోషంగా పార్కు, బీచు వెళ్ళండి కానీ అదే సమయంలో వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళండి..మరీ మొహమాటంగా ఉంటె కనీసం ఫోనులోనైన పలకరించండి అప్పుడే రేపు పెళ్లి తరువాత అక్కడికి మీరు వెళ్ళినా అంత ఇబ్బందిగా మసలరు.
3 ఒక వేళ మీరు అలా పెళ్ళికి ముందే వాళ్ళ ఇంటికి రావడం అయన/ఆవిడ ఇంట్లోని వారికీ నచాకపోతే ఊరికే బాధపడకండి లేక వారిని పాత చింతకాయలని తీసిపారేయకండి ఏదైనా ఒక చిన్న చిరునవ్వుతో స్వీకరించండి.
4 మొహమాటం వలన మీ కాబోయే భర్త/భార్య తరపు బంధువులు మీతో సరిగా మాట్లాడకపోవచ్చు అందుకని వాళ్లందరిని ఒక లిస్ట్లో పెట్టి మాట్లాడకుండా ఉండొద్దు. ఏప్పుడు మాట్లాడితే అప్పుడు సంతోషంగా మాట్లాడండి.
5 ఎవరు ఏది చెప్పినా ఊరికే వినండి కానీ మనకి ఏది మంచిదో దానికి మీ వోటు వేయండి.
6 మీ ఆయన్ని/ఆవిడని నీ చెప్పు చేతల్లో పెట్టుకో అని మీ వాళ్ళు చెపితే విని వదిలేయండి కానీ మనసులో పెట్టుకోకండి. పై పైన దీని వాళ్ళ చాల పెద్ద ప్రమాదాలే రావచ్చు.
7 మీ కాబోయే భర్త/భార్య గురించి ఎన్నో కలలు ముందే పెట్టుకోవద్దు. వీలైనంత ఖాళీగా మీ మనసుని వుంచండి. తన గురించి అన్ని తెలిసుకోండి మెల్లిగా.
8 పెళ్ళికి కొన్ని రోజుల ముందు నుంచి అన్ని మంచి మాటలు, ఆలోచనలు మాత్రమే వినండి, చదవండి అది మీకు మంచిదే చేస్తుంది.
9 పెళ్లిని నూరేళ్ళ పంటగా మార్చాలంటే అన్నింటితో పాటు ఒక మంచి శిక్షణ అవసరం. అది స్వయంగా కావొచ్చు, పెద్ద వాళ్ళ మంచి మాటలు కవోచు లేక స్వశక్తులైన శిక్షణా పరుల దగ్గర కావొచ్చు కానీ అది ముఖ్యంగ చేయాలి.
10 మీ కాబోయే భర్త/భార్య అన్ని మీరే అవ్వాలని అనుకోవడం మంచిదే. కానీ అది ఒక రోజులోనో లేక ఒక నేలలోనో జరిగేది కాదు. దానికి అనుబంధం పెరగాలి, ఓర్పు, అర్థం చేస్కునే తత్వం అని చాల విషయాలు అవసరం. ఉన్నవి పెంచోకొని, లేనివి అలవర్చుకొని మనల్ని తన కోసం మార్చుకోవాలి.
11 ఎంతైనా మీరు ఉన్నంత అన్యోన్యంగా మీ కాబోయే భర్త/భార్య మీ బంధువులతో అంతే ఇదిగా ఉండాలని అనుకోవడం తప్పు. అవన్నీ కాలం గడిచే కొద్ది మారేవి అని అర్థం చేసుకోవాలి.
12 మీకు చాల ఇష్టమైన ఒక అలవాటుని మీ కాబోయే భర్త/భార్య ఒప్పుకోకపోతే వారితో వాదిన్చకండి కొన్ని రోజులు ఆ అలవాటుని మానండి కావలిసినపుడు దాన్ని మళ్లీ తేచుకోవచ్చు.
13 పెళ్ళైన తరువాత మీ కాబోయే భర్త/భార్య మీ ఫ్రెండు మరి ఇన్నాళ్ళుగా ఉన్న మీ ఫ్రెండ్సు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వండి కానీ మొదటి వోటు మీ భార్యకో/భర్తకో ఇవ్వండి.
14 ఒక కుటుంబం పచ్చగా నూరేళ్ళు కలకలగా వర్ధిల్లాలంటే కావలసింది ౨ విషయాలు: ప్రేమ, నమ్మకం. రెండు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుంది. దీనిలో ఏది కొంచం వీడినా మొత్తం కాపురం దెబ్బతింటుంది. అందుకని మీ కన్నా మీ భాగస్వామిని ముందుగా ఉంచి అన్నింటిని ఆలోచించండి.