రక్తహీనత మరియు దీని దుష్ఫలితాలు: ప్రాణికి ఆధారమైన రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ అనే పదార్ధం ఉండవలసిన దాని కంటే తక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధిని రక్తహీనత(ఎనిమియా) అంటారు. ముఖ్యముగా ఈ వ్యాధి పోషకాహారాలోపము వల్ల వస్తుంది. భారతదేశములో ఈ వ్యాధితో బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ వ్యాధితో బాధపడే వారిలో స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు. ఈ వ్యాధి వల్ల ఏమవుతుంది? శరీరములో హిమోగ్లోబిన్ శాతం తగ్గడం వలన ముఖ్యముగా కణజాలాలకు ఆక్సీజన్ సరఫరా తగ్గుతుంది. ఈ విధంగా జరగటం వల్ల ఎనిమియా వ్యాధి లక్షణాలు మొదలవుతాయి. చాలా కాలం ఈ విధముగా జరిగినట్లయితే రక్తహీనత తీవ్రమయి చాతినొప్పి, కళ్ళు తిరగడం మరియు స్పృహ కోల్పోవడం వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ వ్యాధి ప్రారంభస్థితిలో ఈ వ్యాధి బాధపడే వారికి అలసట, నీరసం మరియు గుండెదడ కల్గుతాయి. రక్తహీనత ఎందుకు వస్తుంది?