కావాల్సిన పదార్దాలు:
రాగులు : 1 కిలో
మెంతులు: 100 గ్రాములు
పెసలు: 1/2 కిలో
యాలుకలు: 1 టేబుల్ స్పూన్
తయారుచేసే పద్దతి:
రాగులును,పెసలను,మెంతులని మూడింటిని విడిగా మూడు గంటలు బాగా నానబెట్టాలి.
తర్వాత నీరు పారబోసి వీటిని ఒక ముట్ట కట్టాలి. 8 గంటల సేపు తర్వాత ఇవి మొలకలు వస్తాయి. కబ్బతి ఇవి రాత్రంతా వదిలేయాలి.
మొలకలు వచ్చిన వాటిమీద ఒక పల్చటి వస్త్రం వేసి ఎండలో బాగా ఎండబెట్టాలి.
తర్వాత వీటిని బ్రౌన్ రంగుకు వచ్చేదాక వేయించుకోవాలి.
వేయించుకున్న గింజలను కలిపుకోవాలి వీటికి యాలుకలు కలుపుకోవాలి. విటన్నిటిని పోడిలగా చేసుకోవాలి.
200 మిల్లి లిటేర్స్ నీరులో ఒక స్పూన్ పొడి వేసి సన్న సెగ పైన మరిగించాలి. ఇది ఒక మంచి పోషకవిలువైన పానీయం.