ఈ ఓట్స్ పరోట వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునే వారు ఈ ఓట్స్ పరోట రోజు తీనోచ్చు.
కావలసిన పదార్థాలు
గోధుమ పిండి: 2cup
ఓట్స్ పౌడర్: 2cup
నువ్వులు: 4 tbsp
పచ్చిమిర్చి: 6-8
కొత్తమీర తరుగు: 3 tbsp
ఉప్పు: రుచికి తగినంత
నూనే: సరిపడినంత
తయారు చేయు విధానం:
- ముందుగా ఓట్స్ ను పోడీ లాగా చేసుకోవాలి.
- తర్వాత పచ్చిమిర్చిని బాగా కడుగుకోవాలి.
- పచ్చిమిర్చిని ముక్కలుగా తురుముకోవాలి.
- తర్వాత కొత్తమీర ను కూడా తరిగి ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక పెద్ద కడయీ తీసుకోవాలి.
- అందులో గోదుమపిండీ, ఓట్స్ పౌడర్, నువ్వులు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, తగినంత ఉప్పు వేసి కొంచెం నీరు పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పరోట వల్ల బరువు కూడా తగొచూ.
- ఈ పిండిని ఏదైనా గుడ్డలో రెండు గంటలు నానపెట్టాలి.
- పిండి నానిన తర్వాత కొద్దిగా కొద్దిగా తీసుకొని చపతిలులగా చేసుకోవాలి.
- ఆతర్వాత స్టవ్ మీద పెనం పెట్టి దాని మీద ఈ పరోటాని వేసి కొంచం నూనే రాసుకోవాలి. రెండు వైపుల కాలిన తర్వాత దానిని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
- ఇంకా ఓట్స్ పరోట రెడీ. దీనినీ వేడి వేడిగా సర్వు చేసుకుంటే సరి.