ఆయ సీజన్లో దొరికే పండ్లు తీనడం ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు వర్ష కాలం వచ్చేసింది ఈ కాలంలో లబించే పండ్ల గురించి తెలుసుకుందాం. ఈ కాలంలో పీచేస్, లీచేస్ , రేగిపండ్లు , ఎండుద్రాక్ష, అత్తిపండ్లు, కివిపండ్లు మొదలగునవి ఉన్నవి.
ఇప్పుడు ఒక్కోక దాని గురించి తెలుసుకుందాం.
పీచేస్
ఈ పండు పైన చిన్న కణాలు, దారాలు తొ కట్టి నటుగా మెత్తగా ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఏ, సి బాగా ఉంటాయి. ఈ రెండు విటమిన్లు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచెస్తదీ. శరీరం లోని ఇతర క్రిములు పైన పోరాడతాయి.
ఉపయోగాలు:
1.) కంటిచూపు చక్కగా ఉండటానికి ఏ విటమిన్ పనిచెస్తదీ.
2.) సి విటమిన్ వల్ల శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.
ఎండు ద్రాక్ష:
ఈ పండ్లు తీనటానికి తీయగా ఉంటాయి. ఈ పండులో విటమిన్ ఏ, సి విటమిన్లు యాంటి ఆక్సిడెంట్లుగా పనిచేసి కణజాలం స్తాయిని నుంచి శరీరం దెబ్బతినకుండా కాపాడతాయి. ఇందులో పొటాషియం ఎక్కువుగా లబిస్తది.
ఉపయోగాలు:
- ఇవి ఆహారం పట్ల ఇష్టాన్ని కలిగిస్తాయి.
- వయసు పెరిగేకొద్ది శరీరం పైన వచ్చే ముడతలను తగ్గిస్తాయి.
- పేగులు పరిశుబ్రంగా ఉండడానికి సహకరిస్తాయి.
చెర్రీస్:
ప్రతి ఫంక్షన్ బోజనలలో కిల్లితో పాటు ఈ చెర్రీ పండుని అందించడం ఎక్కువుగా చూస్తున్నాం. ఇవి కాశ్మీర్ లో పండుతాయి. ఇందులో పొటాషియం ఎక్కువుగా లబిస్తది.
ఉపయోగాలు:
- ఇవి రక్తపోటును తగ్గిస్తాయి.
- ఇవి వాతారోగ్గాన్ని నివారిస్తాయి.
లీచెస్:
ఈ లీచేస్ డెహ్రాడున్ ప్రాంతంలో బాగా పండుతాయి. ఇవి ముంబై నగరంలో బాగా కనిపిస్తాయి. వీటిపైన ఉన్న తోలుని తీయటం కొంచం కష్టం అయిన దీనిలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఇంకా కాల్షియం, ఫోస్పోరాస్, ఫోలేటే, పొటాషియం, ఐరన్, పేక్టిన్ ఉన్నాయి.
ఉపయోగాలు:
- దగ్గును తగ్గిస్తదీ.
- రక్తంలోని కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తదీ.
కీవిపండ్లు:
వీటిలో ఫైబర్ ఎక్కువ. అందుకే దీనిని కొంచం తినిన ఎక్కువ సేపు పనిచేస్తుంది. కివిపండులో పొటాషియం, సి విటమిన్ బాగా లబిస్తాయి.
ఉపయోగాలు:
- ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి.
- వర్షాకాలంలో వచ్చే ఫంగస్ మరియు వైరస్ బాధల నుండి రక్షిస్తుంది.
ఈ విదంగా ఆయ పండ్లును ఆయ కాలంలో తినడం ద్వార మంచి ఫలితాలు పొందవచ్చు.