ప్రైవేటు పాటశాలలవైపు మొగ్గు-వార్షిక విద్యాస్థాయి నివేదిక-2011 :
వార్షిక విద్యాస్థాయి నివేదిక-2011 ప్రకారం ప్రైవేటు పాటశాలలో చేరే పిల్లల సంఖ్య నానాటికి పెరుగుతూపోతుంది. ఇప్పటివరకు పట్టణాలలో తల్లితండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాటశాలలో చేర్పిస్తున్నారు. కాని "ప్రదం" అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో ఈ విషయం రూడిఅయినది. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ ఈ విషయమును వెల్లడించారు.
ఇందులో ఉన్న ముఖ్యాంశాలు:
1 . 2006 సంవత్సరములో ఎలిమెంటరి స్థాయి విద్యార్ధులు శాతం ప్రైవేటు పాటశాలలో 18 .7 ఉండగా 2011 నాటికి 25 .6 శాతానికి పెరిగింది.
2 . అయిదేళ్ళ నుండి హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, జమ్ముకాశ్మీర్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, మేఘాలయల్లోని గ్రామీణ ప్రాంతాలలో ప్రైవేటు పాటశాలలో చేరిన పిల్లల సంఖ్య 30 నుంచి 50 శాతమునకు పెరిగింది.
౩. గ్రామీణ విద్యార్ధులలో ఎలిమెంటరీ స్థాయి విధ్యార్దులుల్లో సుమారుగా 96 .7 శాతం పాటశాల్లలో చేరడానికి ఇష్టపడుతున్నారు.
4 . 2007 నాటికి ప్రభుత్వ పాటశాల్లలో 73 .4 శాతం ఉన్న పిల్లల హాజరు శాతం, 2011 నాటికి 70 .9 శాతానికి పడిపోయింది. గత నాలుగు సంవత్సరాలలో బీహారులో హాజరు 9 శాతం తగ్గగా, మధ్యప్రదేశ్ లో 67 నుంచి 54 .5 శాతంనాకు పడిపోయింది. ఉత్తరప్రదేశ్ లో ఈ హాజరు శాతం 7 గా ఉన్నది.
5 . ఈ సర్వే ప్రకారం విద్యార్ధులలో ప్రాధమిక పటనా సామర్ధ్యం క్రమంగా తగ్గుతుందని, ఐదో తరగతి విద్యార్ధి రెండో తరగతి పుస్తకాన్ని పటించే స్థాయి 2010 లో 53 .7 శాతం ఉండగా 2011 నాటికి 48 .2 శాతానికి పడిపోయింది.
6 . రెండెంకెల తీసివేతల లెక్కలు ఎటువంటి తప్పులు లేకుండచేసే మూడవ తరగతి విద్యార్ధుల శాతం 2010 లో 36 .3 ఉంటే 2011 లో 29 .9 శాతమునకు పడిపోయింది. నిష్పత్తులు, తీసివేత కూడికల్లో ఐదో విద్యార్ధుల ప్రతిభ శాతం 2010 లో 70 .9 శాతం ఉండగా, 2011 నాటికి 61 శాతానికి పడిపోయింది.
7 . నిరుడుతో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షినాది రాష్ట్రాలయిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు విద్యలో ముందంజలో ఉన్నాయి.
ఈ సర్వే దేశవ్యాప్తముగా సుమారు 558 జిల్లాలలో 16000 గ్రామాలలో నిర్వహించారు. ఈ సర్వేలో భాగంగా సుమారు మూడు లక్షల మంది ప్రజలను మరియు ఆరు లక్షల మంది పిల్లలను కలిసి విషయాలు తెలుసుకొన్నారు