సాధారనముగా అందరు నునుపైన శరీరాన్ని కోరుకుంటారు. దాని కోసం ఎన్నో ప్రయత్నములు చేస్తారు. కాని ఈ నునుపైన చర్మం కూడా ప్రమాదకరమే. ఎందుకంటే లైకేన్ ప్లానస్ అనే చర్మ వ్యాధి వచ్చిన్నట్లయితే చర్మం మీద నున్నటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి వల్ల ఎక్కడైతే చర్మం మీద నునుపుగా మారుతుందో అచ్చట వెంట్రుకలు మొలవవు. ఈ వ్యాధి చర్మం మీదనే కాకుండా నోరు, ఇతర భాగాలలో కూడా మృదువైన పొరలలో వస్తుంది. కాని జనాలలో ఈ వ్యాధి పైన అంతగా అవగాహన లేదు. ఈ వ్యాధి వల్ల వెంట్రుకల మొదల్లో దురద వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన్నప్పుడు శరీరంపై ఉదారంగు మచ్చలు నునుపుగా ఉంటాయి. ఇవి చిన్న బొడిపెల్ల మెరుస్తూ ఉంటాయి. అయితే ఈ లైకేన్ అనే పదం గ్రీక్ భాషకు చెందింది. దీని అర్థం రాళ్ళు లేదా చెట్ల బెరడుల మీద పెరిగే మొక్క. ప్లానస్ అంటే నునుపుగా ఉండేది అని అర్థం. ఈ వ్యాధి చాల మందిలో వంశ పార్యంపరంగా వస్తుంది. మన దేశములో సుమారుగా 0.3 % మంది ఈ వ్యాధితో బాధపడుతున్న వారే. ఈ సమస్య ముఖ్యముగా 20 నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉన్న వారులో ఎక్కువగా ఉందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువే. సుమారు 4 % పిల్లలు మన దేశములో ఈ సమస్య బాధపడుతున్న వారే.
లైకేన్ ప్లానస్ వ్యాధి కారణాలు:
ఈ వ్యాధి రావడానికి మూల కారణాలు క్రింది విధముగా ఉన్నవి.
1 వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం
2 హెపటైటిస్ సి రకం కామెర్లు రావడం
3 హెపటైటిస్ బి వాక్సిన్ రెండో సారి తీసుకున్న వారిలో ఈ వ్యాధి లక్షణాలు కనపడటం
4 కాలయానికి సిర్రోసిస్ రావడం
5 ఆర్సినిక్, బిస్మత్ మరియు బంగారం లాంటివి ఉపయోగించి చేసే మందులను వాడటం
6 కొన్ని రకాల రసాయనాలకు ఎకస్పోజ్ కావడం
7 క్వినడైన్ గ్లూకమేట్ మరియు క్వినడైన్ సల్ఫేట్ వంటి మందులను చాల కాలం వాడటం
8 మలేరియా కోసం వాడే మందుల సైడ్ ఎఫెక్ట్
లైకేన్ ప్లానస్ లోని రకాలు:
1 లీనియర్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి వల్ల చర్మం పై పగుళ్ళు వరుస గీతల్ల ఉంటాయి. ఈ రకం ముఖ్యముగా చిన్న పిల్లలో ఎక్కువగా వస్తుంది.
2 ఆన్యులర్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి ఎక్కువగా పురుషులలో వస్తుంది. ఈ రకం వచ్చిన్నప్పుడు భుజాల క్రింద మరియు మర్మావయాల భాగాలలో ఉంగరాలాగుండే పగుళ్ళు వస్తాయి. కొన్ని సార్లు ఈ రకం వ్యాధి బయటకు కన్పించక పోవచ్చు.
3 హైపర్ ట్రోఫిక్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి వల్ల చర్మం దళసరిగా మారి విపరీత మైన దురద వస్తుంది. ఇది దీర్ఘకాలిక సమస్య. కాని దీని చికిత్స కష్టతరం.
4 అల్సరేటివ్ లైకేన్ ప్లానస్: ఈ రకం ఎక్కువగా నోటి లోపల వస్తుంది. అంతే కాకుండా పాదాలు మరియు కాలి వేళ్ళపై పగుళ్ళ కన్పిస్తుంది. ఒక్కొక్కసారి కాలి బ్రొటన వ్రేలు శాశ్వతంగా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
5 ఓరల్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి సుమారు 15 % శాతం కేసుల్లో కనపడుతుంది. ఈ రకం ముఖ్యముగా పొగాకు నమిలే వారిలో ఉంటుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పొగాకు వినియోగించే చోట ఈ రకం వ్యాధి ఎక్కువ. చాలా అరుదుగా ఈ రకం వ్యాధి నోటి నుండి గొంతు మరియు కడుపులోనికి వ్యాపిస్తుంది.
6 యాక్టినిక్ లైకేన్ ప్లానస్: ఈ రకం వ్యాధి దుస్తులు కప్పని భాగంలో పగుళ్ళు గా కన్పిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధిని కాన్సర్ గా పొరబడే అవకాశం ఉంది. ఈ వ్యాధి వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ రకం వ్యాధి కన్పిస్తుంది.