మనం ఇపుడు నల్లి చాప్ కా పలావ్ అనే వంటకం గురించి చెప్పుకుంటునం.
కావాల్సిన పదార్దాలు:
మటన్ : 1 కిలో
బాస్మతీరైస్: అరకిలో
ఘరంమసాలా: అర చెంచ
కారం: ఒక స్పూను
ఉప్పు: తగినంత
ఉల్లిపాయలు: అరకిలో
నెయ్యీ: 200 గ్రాములు
పచ్చీమిర్చి: 10
అల్లంవెల్లులి: 2 స్పూన్స్
టొమాటో: 2
పసుపు: అర చెంచ
ధనీయాలపోడి: అర చెంచ
జిలకరపోడి: అర చెంచ
కుంకుమ పూవ్వు: ఒక స్పూను
కొత్తిమీర తురుము: 2 స్పూన్స్
అల్లంముక్కలు: ఒక స్పూను
పుదినా తురుము: ఒక స్పూను
వెన్న: 2 స్పూన్స్
మీగడ : 4 స్పూన్స్
గోరువెచ్చని పాలు: అరలిటర్
నిమ్మకాయ: 1
తయారు చేయు విదానం
- మటన్ ముక్కలను ముందుగా శుబ్రంగా కడుగుకోవాలి.
- బాస్మతీరైస్ ను కడిగి నానబెట్టాలి.
- ఉల్లిపాయల పైన ఉన్న పొట్టును తీసివేసి సన్నగా పొడవుగా వాటిని తరుగుకోవాలి.
- ఇప్పుడు పచ్చిమిర్చినీ తీసుకొని సన్నగా పొడవుగా చీల్చి ఉంచాలి.
- ఇప్పుడు మీగత పచ్చిమిర్చినీ, అల్లంముక్కలు మరియు కొత్తిమీర తురుము మెత్తగా రుబ్బుకోవాలి .
- కుంకుమ పూవ్వును గోరువెచ్చని పాలులో వేసుకొని కొంచం సేపు నాననీవాలి.
- ఇప్పుడు మందపాటి వెడల్పుగా ఉన్న బాండీనీ తీసుకోవాలి.
- ఇప్పుడు అందులో నెయ్యీ వేసి కాగనీయాలి.
- ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయల ముక్కలు వేసి బాగా వేయుంచుకోవాలి.
- అవి వేగిన తర్వాత అందులో పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర కలిపి నూరిన ముద్దను వేయాలి.
- తర్వాత ఇందులో అల్లంవెల్లులి ముద్ద, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర, దనియాల పోడి ఇవన్ని ఇందులో వేసుకొని బాగా కలియబెట్టాలి.
- ఇప్పుడు అన్ని బాగా వేగిన తర్వాత కొంచం నీరు పోసుకొని మసాలా ముద్దలా ఉడికించాలి.
- ఇప్పుడు ఇందులో తరిగిన టొమాటోలు వేసుకోవాలి.
- ఇప్పుడు ఇందులో ఉప్పు గరం మసాలా వేసి బాగా వేయించాలి.
- ఇది బాగా వేగిన తర్వాత మటన్ ముక్కలు వేసి కొంచం ఉడికేంతవరకు మూతపెట్టి ఉంచాలి.
- ముక్కలు మెత్తబటిన తర్వాత ఇందులో కొద్దిగా నిమ్మరసం కలిపి దించుకోవాలి.
- వీడిగా మరో గిన్నెలో సరిపడా నీరు పోసుకొని వాటిని బాగా మరిగించాలి.
- తర్వాత ఇందులో కడిగి ఉంచిన బాస్మతీరైస్ వేసి ఉడికించాలి.
- అన్నం సగం ఉడికిన తర్వాత దించి నీరు వంపేయాలి.
- ఇప్పుడు ఆ అన్నాన్ని మటన్ ముక్కలు మీద వేసి కుంకుమ పూవ్వు కలిపిన పాలు, మీగడ, వెన్న, గరం మసాలా, పొదిన తురుము, చీల్చిన పచ్చీమిర్చి వేసి మూతపెట్టాలి.
- తర్వాత సిమ్ లో సుమారు 25 నిమిషాలు దమ్ చేయాలి.